Search This Blog

Tuesday, March 20, 2012

తెలుగు సాలెగూళ్లు

http://www.greatertelugu.com
http://www.cpbrownacademy.org
www.teluguwebsites.com/
http://www.telugubazar.com/

http://www.teluguone.com/
http://www.indlebrain.com/
http://www.desitorrents.com/
http://www.studentshangout.com/
http://www.project-pirates.net/
http://www.tmstorrents.com/
http://www.idesir.com/
http://www.telugustation.com/
http://www.ragalahari.com/
http://www.subhakankshalu.com/
www.radiokushi.com/program_list.cgi?con=in
http://www.cinegoer.com/
http://www.telugulo.com/
http://www.teluguwebsite.com/
http://www.saradaga.com/
http://www.telugudanam.co.in/
http://telugudukanam.co.in/
http://www.raaga.com/
http://www.idlebrain.com/
http://www.indianglitz.com/
http://www.filimchamber.com/
http://www.ragalahari.com/
http://www.webprapancham.com/
http://www.greatandhra.com/
http://www.andharavilas.com/
http://www.tollywoodexclusive.blogspot.com/
http://www.indivilas.com/
http://www.computerera.tk/
http://www.indiavilas.com/
http://www.telugustuff.com/
http://www.greatandhra.com/
http://www.vartha.com/
http://www.tollywoodexclusive.blogspot.com/
http://www.lazydesis.com/
http://www.asuku.com/
http://blog.charasala.com/
http://te.wikipedia.org/wiki
http://vjyothi.wordpress.com/
http://poddu.net/
http://pathabangaram.com/
http://www.telugubloggers.blogspot.com/
http://www.tmstorrents.com/
http://www.oldtelugusongs.com/
http://www.chimatamusic.com/
http://www.telugugreetings.fotorima.com/
http://www.radiokhushi.com/
http://www.omnamovenkatesaya.com/html/telugu_links.htm
http://www.telugulinks.net/
http://music.usaindians.com/
http://www.andhrabharati.com/
http://www.maganti.org/
http://www.truvio.com/
http://jyothivalaboju.blogspot.com/
http://shadruchulu.blogspot.com/
http://annapoorna-jyothi.blogspot.com/
http://geetalahari.blogspot.com/
http://jyothiv.blogspot.com/
http://nuvvusetty.wordpress.com/
http://www.telugudanam.co.in/homepage_addons/mana_telugu.htm

తెలుగువారి చరిత్ర



ఆంధ్రుల చరిత్ర


పూర్వ యుగము

            మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది.

            క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండీ ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి.


మౌర్యకాలము క్రీ.పూ.322 - 184

            చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడు. క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.

శాతవాహనులు - క్రీ.పూ.200 - క్రీ.శ.200

              మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ.2వ శతాబ్ది వరకు షుమారు 400 సంవత్సరాలు సాగింది. షుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్)కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. క్రీ.శ.62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ మరియు వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. క్రీ.శ. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.

                శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధించిన మహాయానం.

కళింగులు క్రీ.పూ. 200 - క్రీ.శ.420

                  మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు.


              తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది.
    
                  ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (క్రీ.శ.400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (క్రీ. శ. 300-450).

ఇక్ష్వాకులు క్రీ. శ. 225 - 300

                   శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు క్రీ.శ.225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ ఛాంతమూలుడు (క్రీ. శ. 225-245) గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (క్రీ. శ. 245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు)లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉన్నది. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.

బృహత్పలాయనులు - క్రీ.శ. 275 ప్రాంతం

                   ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీ. శ. నాలుగవ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తటప్రాంతమును బృహత్పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారము జయవర్మ కూదూరు (కృష్ణా జిల్లా, మచిలీపట్నం తాలూకా లోని గూడూరు)రాజధానిగా పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి భాపహానవర్మ "మహాతలవర" మరియు "మహాదండనాయక" అని చెప్పబడ్డాడు. నాగార్జునకొండ వద్ద దొరికిన ఒక ఇక్ష్వాకుల శాసనములో "బహఫల సగోత్తాయ సిరివమ్మ భటాయా" అని ఉన్నది. ఈమె కుటుంబమువాడే జయవర్మ అయిఉండవచ్చును. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రులు ఎవరైనా రాజ్యము చేశారేమో తెలియదు. వీరి రాజ్యము శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండవచ్చును.

అనందగోత్రులు క్రీ.శ. 295 - 620

                చేజెర్ల లొ దొరికిన ఐదవ శతాబ్ది చివరికాలపు సంస్కృత శాసనము ప్రకారము అనంద మహర్షి గోత్రీకుడగు కందరరాజు ధాన్యకటక యుద్ధములో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఈతని రాజ్యము కృష్ణానది దక్షిణ తీరము నుండి త్రికూట పర్వతము (కోటప్పకొండ) వరకు వ్యాపించి ఉన్నది. రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. తరువాతి రాజులు దామోదరవర్మ, అత్తివర్మ. వీరు వైదికమతాభిమానులైనను బౌద్ధమును ఆదరించారు. బౌద్ధమత క్షీణదశ అప్పటికి ప్రారంభము కాలేదు. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీ. శ. అయిదవ శతాబ్ది చివరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యము అంతరించినది.

శాలంకాయనులు క్రీ. శ.300 - 420

                 "శాలంకాయన" అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రజులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ క్రీ.శ.320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్దాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.

విష్ణుకుండినులు క్రీ. శ. 375-613

                    శాలంకాయనులతరువాత వేంగీదేశమును విష్ణుకుండినులు క్రీ. శ. 375 నుండి క్రీ. శ. 613వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. భారతదేశములో ఇలాంటి నాణెములు తొలుతగా ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని "ఇంద్రపురం" ప్రస్తుత నల్గొండ జిల్లా (రామన్నపేట తాలూకా) ఇంద్రపాలగుట్ట కావచ్చునని ఒక అభిప్రాయం.

                     క్రీ. శ. 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగ రాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమయ్యింది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణా ప్రాంతం వాకాటకుల పాలనలో ఉంది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది.

పల్లవులు

                    సాతవాహనాంతరికులలో తక్కిన రాజవంశములలో వైశాల్యమున అధికతరమగు రాజ్యమును దీర్ఘ కాలము పాలించిన వారు పల్లవులు. ఉచ్చదశలో కృష్ణానది ఉత్తరపు ఎల్లగా, కావేరీనది దక్షిణపు సరిహద్దుగా వర్తించాయి. ఆంధ్ర-తమిళ ప్రాంతమునే గాక కర్ణాట ప్రాంతముపై కూడ కొంతకాలము ఆధిపత్యము నిర్వహించారు.
పూర్వమధ్య యుగము

పూర్వమధ్య యుగము

మహాపల్లవులు

                6వ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా "మహా పల్లవులు" అంటారు. వీరిలో వీరకుర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచికల్లు (మాచర్ల వద్ద) లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీ. శ. 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటినీ జయించాడు. విస్తరణ దశలో ఉన్నరెండు వంశాలైన పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య అధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కాని బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమయ్యే అవకాశం లభించింది. 9వ శతాబ్దం వరకు పల్లవుల పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు.

రేనాటి చో(డు)ళులు

                 రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు.

చాళుక్యులు

                వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతమములోని చాళుక్యవిషయమును పరిపాలించారు[3]. తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒక మహాసామ్రాజ్యసంభూతులైరి. చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీ.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి, కమ్మనాడు వైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. క్రీ. శ. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర క్రీ. శ. 1076 వరకు స్థిరముగా పాలించారు.

               ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలోని ప్రాంతాన్ని వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. 755-968 మధ్య కాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చెప్పుకొనేవారు. కాని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులలాగా తమది సూర్యవంశమని చెప్పుకొన్నారు.

రాష్ట్రకూటులు

                రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. క్రీ.శ. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడ అందురు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

పూర్వ చాళుక్యులు


                    తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము. ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల, మరియు పొరుగు రాజ్యాలతో - ముఖ్యంగా రాష్ట్రకూటులు మరియు కళింగులతోను తరువాత చోళులతోను యుద్ధాలవల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది.

              తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు.

పూర్వ గాంగులు

                   వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్యాన తూర్పు (పూర్వ) గాంగులు, దక్షిణాన పల్లవులు పరిపాలించారు. పూర్వ గాంగులు 5వ శతాబ్దం చివరలో ఒరిస్సా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ (6వ శతాబ్దం) రాజధాని "దంతిపురం". తరువాత రాజధానిని కళింగ నగరం (శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగం) కు మార్చబడింది. షుమారు 5 వందల సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒరిస్సాలోని కటక్ ప్రధాన కేంద్రమయ్యింది.

చాళుక్య చోళులు

                   1వ రాజరాజ చోళుని (క్రీ. శ. 985 - 1016) నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజచోళుని సహాయం అర్ధించాడు. ఇది అవకాశంగా రాజరాజు వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిగా చేశాడు. తరువాత చోళులకు, కళ్యాణీ చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధరంగమయ్యింది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నాక వారిని చాళుక్యచోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళ రాజు రాజేంద్రుడు క్రీ. శ. 1070లో 1వ కులోత్తుంగ చోళునిగా చోళసింహాసనం అధిష్టించాడు. క్రీ. శ. 1076వరకు వేంగిలో చాళుక్యచోళుల పాలన (చోళుల రక్షణ, అధీనంలో) సాగింది.

కాకతీయులు

                           కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).
కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి

క్రీ. శ. 1000 - 1158 - తెలంగాణ విమోచన:

                           ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగానే ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడి స్తబ్దంగా మారింది. ప్రజలలో పుట్టి కష్ట సుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వతంత్రతతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఒక్కమారుగా ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు.

క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : 

                                 ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయల సీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒక పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. కాని కులాల మధ్య విద్వేషాలు ఈ కాలంలో పెరగ సాగాయి.

క్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: 

                                     ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు, కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉత్తర దేశపు దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.

అర్వాచీన గాంగులు

                         12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తరువాత కళ్యాణి చాళుక్యులను చోళులు, వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు (గుంటూరు) ప్రాంతాన్ని చోళుల సామంతులు అయిన వెలనాటి చోళులు పాలించారు. క్రీ. శ. 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు అధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్నచిన్న రాజకుటుంబాలు పాలించాయి. రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమే పల్నాటి యుద్ధం.
ఉత్తరమధ్య యుగము

ఉత్తరమధ్య యుగము

ముసునూరి నాయకులు


               ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. ప్రోలయనాయకుని మరణానంతరం క్రీ. శ. 1333లో కాపయనాయకుడు మళ్ళీ ఓరుగల్లు రాజయ్యాడు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.

ఓఢ్ర గజపతులు, రేచెర్ల వెలమలు, కొండవీటి రాజ్యము, రాజమహేంద్రవర రాజ్యము

              ఇవన్నీ దాదాపు ఆంధ్ర దేశపు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో నడచిన రాజ్యాలు. ముసునూరు నాయకులను తొలగించి రేచెర్ల నాయకులు రాజులయ్యారు. క్రీ. శ. 1325 నుండి 1474 వరకు తెలంగాణా మొత్తం వారి అధీనంలో ఉంది. రాజధాని రాచకొండ. తీరాంధ్ర దేశం క్రీ. శ. 1325 - 1424 మధ్య కాలంలో కొండవీటి రెడ్ల పాలనలో ఉంది. మొదట వారి రాజధాని అద్దంకి. తరువాత కొండవీటికి మార్చబడింది. అదే సమయంలో రాజమండ్రి ప్రాంతం ఇతర రెడ్ల పాలనలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతం గజపతుల అధీనంలో ఉంది. ఒరిస్సా కటక్‌నుండి పాలిస్తున్న గజపతులు క్రీ. శ. 1448లో రాజమండ్రి రెడ్లను జయించారు. కాని క్రమంగా అన్ని ప్రాంతాలు విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళాయి. కొండవీటి రెడ్ల కాలంలోని ముఖ్య కవులు శ్రీనాధుడు, ఎర్రా ప్రగడ.

బహమనీ రాజ్యము


                 క్రీ. శ. 1323లో ఓరుగల్లు పతనానంతరం ఆంద్రులు మొట్టమొదటి సారిగా ముస్లిముల పాలనలోకి వచ్చారు. క్రీ. శ. 1347లో ఢిల్లీ సుల్తానులనుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొని అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యం స్థాపించాడు. క్రీ. శ. 1347 నుండి దాదాపు క్రీ. శ. 1425 వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధానిని మహమ్మదాబాద్‌ (బీదర్‌)కు తరలించారు. బహుమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (క్రీ. శ. 1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. క్రీ. శ. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్ (నిజాం షాహి), బీరార్ (ఇమాద్ షాహి), బీదర్ (బారిద్ షాహి), బీజాపూర్ (అహమ్మద్ షాహి), మరియు గోలకొండ (కుతుబ్ షాహి) - ఇవి దక్కన్‌ సుల్తనత్ లుగా పేరు పొందాయి. వీటిలో కుతుబ్ షాహి వంశం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంది.

విజయనగర సామ్రాజ్యము

              విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు క్రీ. శ. 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.

               తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

                      క్రీ. శ. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. క్రీ. శ. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. క్రీ. శ. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని సుల్తానుల సమాఖ్య చిత్తుగా ఓడించారు. రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.
ఆధునిక యుగము




తెలుగు రాష్ట్రం


               ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

“అమరావతీ పట్టణమున బౌద్ధులు
విశ్వవిద్యాలయములు స్థాపించు నాఁడు
ఓరుగల్లున రాజవీర లాంఛనములుగాఁ
బలు శస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
పెండ్లి పందిళ్ళు కప్పించు నాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
దిగ్జయ స్తంభమెత్తించునాఁడు

ఆంధ్ర సంతతికే మహితాభిమాన
దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
నా మహావేశ మర్ధించి యాంధ్రులార!
చల్లుఁడాంధ్ర లోకమున నక్షతలు నేఁడు!

                                                                                                                          -- రాయప్రోలు సుబ్బారావు

             అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం)గా విభజిస్తారు


తెలుగు జాతి

              ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకొన్నాయి. ఆంధ్రుల జాతీయతను గురించి లభించిన వివిధ (చాలా వరకు అస్పష్టమైన) ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు - నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు మరియు శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. వీరిలో నాగులు పంజాబు ప్రాంతంలో (క్రీ.పూ. 600 నాటికి) ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదితీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.

            క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికీ, సమాగమనానికీ మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రజాతి రూపు దిద్దుకొంది.


తెలుగు సాహిత్యం




తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును. 

నన్నయకు ముందు కాలం - (క్రీ.శ. 1020 వరకు)

             11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

పురాణ యుగము - ( క్రీ.శ.1020 - క్రీ.శ.1400)

            దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

              నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

మధ్య యుగము లేదా శ్రీనాథుని యుగము - (క్రీ.శ.1400 - క్రీ.శ.1510)

          ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

ప్రబంధ యుగము - (క్రీ.శ.1510 - క్రీ.శ.1600)

           విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.


దాక్షిణాత్య యుగము - (క్రీ.శ.1600 - క్రీ.శ.1820)

          కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.

ఆధునిక యుగము - (క్రీ.శ.1820 తరువాత)

        1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

        గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

          మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

       19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

తెలుగు సంఖ్యామానము




ఒకటి = ౧
రెండు = ౨
మూడు = ౩
నాలుగు = ౪
ఐదు = ౫
ఆరు = ౬
ఏడు = ౭
ఎనిమిది = ౮
తొమ్మిది = ౯
పది = ౧౦
నూరు = ౧౦౦
వేయి = ౧౦౦౦
పది వేలు = ౧౦౦౦౦
లక్ష = ౧౦౦౦౦౦
పది లక్షలు = ౧౦౦౦౦౦౦
కోటి = ౧౦౦౦౦౦౦౦
దశ కోటి = ౧౦౦౦౦౦౦౦౦
శత కోటి = ౧౦౦౦౦౦౦౦౦౦
సహస్ర కోటి ( అర్బుదం ) = ౧౦౦౦౦౦౦౦౦౦౦
న్యర్బుదం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦
ఖర్వము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా ఖర్వము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పద్మము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా పద్మము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షోణి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షోణి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
శంకము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా శంకము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షితి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షితి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షోభము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షోభము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
నిధి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా నిధి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పరతం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పరర్థము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అనంతము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
సాగరము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అవ్యయం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అమృతం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అచింత్యం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అమేయము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
భూరి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా భూరి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦

తెలుగు భాషా స్వరూపము


భాషా స్వరూపము

శబ్దము:
           
          తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.


అం అః
/a/ /ɑː/ /ɪ/ /iː/ /u/ /uː/ /ru/ /ruː/ /lu/ /luː/ /e/ /eː/ /ai/ /o/ /oː/ /au/ /am/ /aha/



          తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
మాండలికాలు

            అంకతి, ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి, కమ్మర , కామాటి, కాశికాపిడి , కొడువ, మేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒరిస్సా(బడగ )--1961 సెన్సస్, బంజారా[లంబాడి], లిపి ప్రధాన వ్యాసము తెలుగు లిపి, తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది.

          తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.


            తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.

వైభవేపోత తెనుంగు



తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”                                           —శ్రీ కృష్ణదేవ రాయలు



తియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -”                                                 —చేరువేల భార్గవ శర్మ



జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”                                             — వినుకొండ వల్లభరాయడు



సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”                                            — మిరియాల రామకృష్ణ


తెలుగు భాషా చరిత్ర


చరిత్ర:


              ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

               అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది.

              ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

           ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

"పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"

      ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:  అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

తెలుగు, తెనుగు, ఆంధ్రము:

       ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.

         ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.

          క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు

         శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

తెలుగు భాష


                   తెలుగు భారత దేశము లోని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష. భారత దేశం లో 7.4 కోట్ల తెలుగు మాట్లాడే జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోవుంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. 1997 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6.97 కోట్లు మందికి పైగా తెలుగును మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది


                 కొంతమంది భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి.

                   తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాష, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.


             తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.

               సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి.

            భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.
             
               తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది